పేజీలు

విఙ్ఞానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విఙ్ఞానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, డిసెంబర్ 2015, బుధవారం

కంటి పరీక్ష పత్రము

       దృష్టి తీక్షణత పరీక్షించటానికి ఉపయోగించే పత్రం. దీనిని మనిషి దూర చూపు లోపాలు తెలుసుకోవటం కోసం కంటి వైద్యులు ఉపయోగిస్తారు. ఈ పత్రంలో అక్షరాలు లేదా అంకెలు లేదా చిహ్నాలు అనేక వరుసలు, పరిమాణాలలో ఉంటాయి. ఒక్కో వరుస ఒక్కో పరిమాణంలో ఉంటుంది. పత్రం కిందికి వెళ్ళేకొద్ది అక్షర పరిమాణం తగ్గుతుంది. ప్రపంచంలో ఎక్కువగా వాడే పత్రం - స్నెల్లెన్ పత్రము. హెర్మన్ స్నెల్లెన్ అనే నెథెర్లాండుకి  చెందిన కంటి వైద్యుడు 1892 లో రూపుదిద్దాడు.
 
 



(ఈ చిత్రం వికీపీడియా నుండి సేకరించబడినది)
 
        మనం స్నెల్లెన్ పత్రంలో, 20/20 అని సూచించబడిన వరుస తీసుకుంటే, లవములో ఉన్న అంకె మనిషి దూరాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడూ 20నే ఉంటుంది. అంటే,  పరీక్షించబడే మనిషి ఎప్పుడూ 20 అడుగుల దూరంలో ఉండాలి.  హారంలో ఉన్న అంకె ఎంత దూరం నుండి ఆ వరుస చక్కగా కనిపిస్తుందో  సూచిస్తుంది. అంటే, ఈ వరుస 20 అడుగుల నుండి చక్కగా కనిపించాలి.  20/200 చూపు తీక్షణత ఉన్న మనిషి ఆమెరికా చట్టరిత్యా అంధుడిగా పరిగణించబడతాడు.

26, జనవరి 2014, ఆదివారం

జాతీయ 'ఓటర్ల ' దినోత్సవం


              ఈ రోజు దినపత్రిక తిరగవేస్తుంటే ఒక కొత్త విషయం తెలిసింది. అది 'జాతీయ ఓటర్ల దినోత్సవం' ('ఓటర్ ' అనే ఆంగ్ల పదము తెలుగు పదముగా స్థిర పడ్డట్లేనా?) అనేది ఒకటి ఉందనీ, అది జనవరి 25న అని. అంటే, ఏమిటా అని కుతూహలం కొద్ది అంతర్జాలంలో వెతికాను. మన భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుని (అది జనవరి 25, 1950లో ఏర్పడింది) 2011వ సంవత్సరం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా పరిగణిస్తున్నదని తెలిసింది. ఇంకా వివరాలలోకి వెళ్ళితే, ఈ రోజున 18 సంవత్సరములు నిండిన యువతకు ఓటరు గుర్తింపు 'కార్డు' లు ('కార్డు' కూడా మన భాషలో కలిసిపోయింది!?) జారి చేస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం సజావుగా సాగుతుంటే, సంతోషించ దగిన విషయమే.

             అందఱికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.