పేజీలు

26, ఆగస్టు 2010, గురువారం

విశ్వమాత

( చిత్రం స్ట్టాంప్స్ బుక్స్.ఆర్గ్ నుండి సేకరించబడినది)

ఆగష్టు 26, 1910 అల్బేనియాలో జననం. అసలు పేరు ఆగ్నెస్ గోన్షా భుజాక్షువు. గోన్షా అంటే మొగ్గ అని అర్థం. 9 యేట తండ్రి మరణం. 18 యేట సన్యాసినిగా సేవ చేయటానికి నిశ్చయించుకుని తల్లిని, అక్కని, అన్నయ్యని వదిలి ప్రయాణం. జనవరి 6, 1929 భారత దేశం వచ్చింది. 21 యేట సన్యాసినిగా మారి నిర్విరామంగా, నిస్వార్థంగా తుది శ్వాస విడిచే వరకు పేద ప్రజల సేవార్దం తన నిండు జీవితాన్ని వెచ్చించిన మాతృమూర్తి. 1948 సంవత్సరంలో భారత దేశ పౌరసత్వం పొంది, ఆదే యేట ఆగష్టు 16 నుండి నీలం అంచు తెల్లచీర ధరించి, తన కాన్వెంట్ పరిధి నుండి బయటికి వచ్చి ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపటానికి నడుం బిగించింది, 1950లో సమాజంలో కూడు, గుడ్డ లేని అభాగ్యులు, వికలాంగులు, నిరాధరణకి గురైన కృష్టు రోగుల కోసం 'మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ' స్థాపన. 1952లో 'నిర్మల్ హృదయ్' స్థాపన. 1955లో అనాధల కోసం 'నిర్మల్ శిషు భవన్ ' స్థాపన. అన్నిటికీ మించి వాటిలో ఆమె నిరంతర, నిస్వార్థ సేవ ఆమె ఔధార్యాన్ని, సేవాగుణాన్ని ప్రపంచానికి చాటింది. అనతి కాలంలొనే అనేక దేశాలకి ఆమె సేవాకార్యక్రమాలు విస్తరించాయి, భారత ప్రభుత్వం తొలిసారిగా 1962లో పద్మశ్రీతొ గుర్తించింది. 1980లో దేశ విశిష్టమైన భారతరత్నతో సత్కరించింది. 1979లో విశిష్టమైన నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. బహుమతితో వచ్చిన నగదు మొత్తాన్ని, దాని ప్రధాననంతరం ఇచ్చే విందుభోజనాన్ని రద్దు చేయించి ఖర్చుతో పేదల పొట్ట నింపిన కరుణామయి. సెప్టెంబరు 5, 1997 తుది శ్వాస విడిచిన ఆమె, తన స్థానాన్ని భర్తి చేసే వారు పుట్టుతూనే వుంటారని వినమ్రంగా భరోసాని ఇచ్చి వెళ్ళింది.