పేజీలు

12, ఏప్రిల్ 2014, శనివారం

తెలుగు వర్ణములు


అచ్చులు

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః


హల్లులు

- క వర్గము

చ ౘ జ ౙ - చ వర్గము

ణ - ట వర్గము

న - త వర్గము

మ - ప వర్గము

య ర ఱ ల ళ వ స హ క్ష


అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ - హ్రస్వములు - రెప్పపాటు కాలములో పలికెడివి

ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ - దీర్ఘములు - సాగదీసి పలికెడివి

ఎ, ఏ, ఒ, ఓ - వక్రములు - వంకరగా ఉండెడివి  

ఎ, ఒ - హ్రస్వవక్రములు - రెప్పపాటు కాలములో పలికెడివి, వంకరగా ఉండెడివి  

ఐ, ఔ - వక్రతమములు - బాగా వంకరగా ఉండెడివి

అం, అఁ, అః - ఉభయాక్షరములు - అచ్చులలోను, హల్లులలోను పరిగణించబడెడివి 

అం * - సున్న, నిండుసున్న, పూర్ణబిందువు, పూర్ణానుస్వారము 

అఁ * - అఱసున్న, అర్ధసున్న, అర్థబిందువు, ఖండబిందువు

అః * - విసర్గ - విడవబడెడిది

క, చ, ౘ, ట, త, ప - పరుషములు

గ, జ, ౙ, డ, ద, బ - సరళములు

ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష - స్థిరములు - వ్యాకరణ కార్యములలో మారనట్టివి 
 
క నుండి మ వరకు  - స్పర్శములు

య, ర, ఱ, ల, ళ, వ - అంతస్థములు - స్పర్శములకు ఊష్మములకు మధ్య ఉండెడివి  

శ, ష, స, హ - ఊష్మములు - ఊది పలికెడివి


_ తో సూచించబడిన వర్ణములు సంస్కృతమునుండి తెలుగు లోనికి వచ్చినవి.
* సున్న, అఱసున్న, విసర్గ విడిగా వ్రాయడం కుదరక 'అ' తో కలిపి వ్రాయడం జరిగినదని గమనించగలరు
  

20, మార్చి 2014, గురువారం

యకారము, వు, వూ, వొ, వో అనే అక్షరములు తెలుగు పదములకు మొదట లేవు

        మన భాషలో వేరే భాష నుండి వచ్చి కలసిన పదములు అనేకం ఉన్నాయని మనకి తెలుసు. కాని ఆవి ఏవో మనకు చాలా వరకు తెలియదు. అవి తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి, దానికంటే ముందుగా మనకు తెలిసిన తెలుగు పదములను మనము తప్పకుండా గుర్తించాలి. తప్పుగా వ్రాస్తుంటే సరిచేసుకోవాలి. నేను చేస్తున్న ఆ ప్రయత్నంలో నేను నేర్చుకున్న ఈ సూత్రం మీ ముందు ఉంచుతున్నాను.

యకారము, వు, వూ, వొ, వో అనే అక్షరములు తెలుగు పదములకు మొదట లేవు.

        మనం విశ్లేషించుకుంటే ఈ సూత్రం ప్రకారం మనకు కొన్ని విషయాలు బోధపడతాయి. అలాగే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. మొదట మనం అర్ధం చేసుకోవలసినవి చూసుకుంటే 1) మన భాషలో ఈ అక్షరములతో మొదలయ్యే పదములు ఉండవు అని అర్ధం అవుతున్నది. 2) మనకు తెలిసిన చిన్న చిన్న పదములు మనం తప్పుగా వ్రాస్తుంటే సరిదిద్దుకోవచ్చు. ఇక, ఎందుకు ఉండవు అంటే ఎ, ఏ, ఉ, ఊ, ఒ, ఓ అనే అక్షరములతో పదములు మొదలవుతాయని దీని అర్ధం.

ఉదాహరణలు:

ఉత్తరం, ఉడుత, ఊరు; ఊపిరి, ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఏల, ఒక్కటి, ఒంటె, ఓడ, ఓనమాలు

        చివరగా, మన భాషలో చాలా పదములు సంస్కృతము నుండి వచ్చి కలిసాయని మనలో చాలా మందికి విదితమే. 'ఒ' అనే అక్షరము సంస్కృతములో లేదు. అంటే, 'ఒ' తో మొదలయ్యే పదములు చాలా వరకు తెలుగువే అని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఓటు, ఓటరు అనే పదములు మన ఆంగ్ల పరిజ్ఞానంతో ఆ బాష నుండి కలిసాయని మనకు తెలిసినదే.

గమనిక/విజ్ఞప్తి: పైన చర్చించిన విషయములో ఏవైనా  తప్పులుంటే విజ్ఞులు సరిదిద్దగలరు. ఏదైనా జతచెయ్యదలచినా, సదా ఆహ్వానం.

 

31, జనవరి 2014, శుక్రవారం

సున్న రూపాయి కాగితం

                                          (ఈ చిత్రం www.5thpillar.org నుండి సేకరించబడినది)

             మీరు పైన చూస్తున్నది సున్న రూపాయి కాగితం. యాభై రూపాయల కాగితం నమూనాలో ముద్రించబడినది. ఇది సరదాగా ముద్రించినది మాత్రం కాదు. దీని వెనుక ఒక మంచి ఆశయం ఉంది. ఇది 'ఐదవ స్తంబము' అనే లాభాపేక్షలేని సంస్థ  మనదేశంలోని లంచగొండితనాన్ని ఎదురుకోవాలనే సంకల్పంతో 2007 లో మొదలుపెట్టిన కార్యక్రమం. ఈ సంస్థను విజయానంద్ అనే సమాచార సాంకేతిక నిపుణుడు అమెరికా నుండి తిరిగి వచ్చి 2006లో స్థాపించాడు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాలు కోసం పైన చిత్రం క్రింద ఇవ్వబడిన చిరునామాని సందర్శించండి.


26, జనవరి 2014, ఆదివారం

జాతీయ 'ఓటర్ల ' దినోత్సవం


              ఈ రోజు దినపత్రిక తిరగవేస్తుంటే ఒక కొత్త విషయం తెలిసింది. అది 'జాతీయ ఓటర్ల దినోత్సవం' ('ఓటర్ ' అనే ఆంగ్ల పదము తెలుగు పదముగా స్థిర పడ్డట్లేనా?) అనేది ఒకటి ఉందనీ, అది జనవరి 25న అని. అంటే, ఏమిటా అని కుతూహలం కొద్ది అంతర్జాలంలో వెతికాను. మన భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుని (అది జనవరి 25, 1950లో ఏర్పడింది) 2011వ సంవత్సరం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా పరిగణిస్తున్నదని తెలిసింది. ఇంకా వివరాలలోకి వెళ్ళితే, ఈ రోజున 18 సంవత్సరములు నిండిన యువతకు ఓటరు గుర్తింపు 'కార్డు' లు ('కార్డు' కూడా మన భాషలో కలిసిపోయింది!?) జారి చేస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం సజావుగా సాగుతుంటే, సంతోషించ దగిన విషయమే.

             అందఱికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.