దృష్టి తీక్షణత పరీక్షించటానికి ఉపయోగించే పత్రం. దీనిని మనిషి దూర చూపు లోపాలు
తెలుసుకోవటం కోసం కంటి వైద్యులు ఉపయోగిస్తారు. ఈ పత్రంలో అక్షరాలు లేదా అంకెలు లేదా చిహ్నాలు
అనేక వరుసలు, పరిమాణాలలో ఉంటాయి. ఒక్కో వరుస ఒక్కో పరిమాణంలో ఉంటుంది. పత్రం కిందికి
వెళ్ళేకొద్ది అక్షర పరిమాణం తగ్గుతుంది. ప్రపంచంలో ఎక్కువగా వాడే పత్రం - స్నెల్లెన్ పత్రము. హెర్మన్ స్నెల్లెన్
అనే నెథెర్లాండుకి చెందిన కంటి వైద్యుడు 1892 లో రూపుదిద్దాడు.
![]() |
(ఈ చిత్రం వికీపీడియా నుండి సేకరించబడినది) |
మనం స్నెల్లెన్
పత్రంలో, 20/20 అని సూచించబడిన వరుస తీసుకుంటే, లవములో ఉన్న అంకె మనిషి దూరాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడూ
20నే ఉంటుంది. అంటే, పరీక్షించబడే మనిషి ఎప్పుడూ 20 అడుగుల దూరంలో ఉండాలి. హారంలో ఉన్న అంకె ఎంత దూరం నుండి ఆ వరుస చక్కగా
కనిపిస్తుందో సూచిస్తుంది. అంటే, ఈ వరుస 20 అడుగుల నుండి చక్కగా కనిపించాలి. 20/200 చూపు తీక్షణత
ఉన్న మనిషి ఆమెరికా చట్టరిత్యా
అంధుడిగా పరిగణించబడతాడు.