అచ్చులు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః
హల్లులు
క ఖ గ ఘ ఙ - క వర్గము
చ ౘ ఛ జ ౙ ఝ ఞ - చ వర్గము
ట ఠ డ ఢ ణ - ట వర్గము
త థ ద ధ న - త వర్గము
ప ఫ బ భ మ - ప వర్గము
య ర ఱ ల ళ వ శ ష స హ క్ష
అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ - హ్రస్వములు - రెప్పపాటు కాలములో పలికెడివి
ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ - దీర్ఘములు - సాగదీసి పలికెడివి
ఎ, ఏ, ఒ, ఓ - వక్రములు - వంకరగా ఉండెడివి
ఎ, ఒ - హ్రస్వవక్రములు - రెప్పపాటు కాలములో పలికెడివి, వంకరగా ఉండెడివి
ఐ, ఔ - వక్రతమములు - బాగా వంకరగా ఉండెడివి
అం, అఁ, అః - ఉభయాక్షరములు - అచ్చులలోను, హల్లులలోను పరిగణించబడెడివి
అం * - సున్న, నిండుసున్న, పూర్ణబిందువు, పూర్ణానుస్వారము
అఁ * - అఱసున్న, అర్ధసున్న, అర్థబిందువు, ఖండబిందువు
అః * - విసర్గ - విడవబడెడిది
క, చ, ౘ, ట, త, ప - పరుషములు
గ, జ, ౙ, డ, ద, బ - సరళములు
ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష - స్థిరములు - వ్యాకరణ కార్యములలో మారనట్టివి
క నుండి మ వరకు - స్పర్శములు
య, ర, ఱ, ల, ళ, వ - అంతస్థములు - స్పర్శములకు ఊష్మములకు మధ్య ఉండెడివి
శ, ష, స, హ - ఊష్మములు - ఊది పలికెడివి
_ తో సూచించబడిన వర్ణములు సంస్కృతమునుండి తెలుగు లోనికి వచ్చినవి.
* సున్న, అఱసున్న, విసర్గ విడిగా వ్రాయడం కుదరక 'అ' తో కలిపి వ్రాయడం జరిగినదని గమనించగలరు
chala bagundi
రిప్లయితొలగించండిబ్లాగుని సందర్శించి మీ విలువైన అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి